ఇంట్లోకొచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీసి మరీ ఫుడ్ దొంగలించిన ఎలుగుబంటి… వీడియో వైరల్..
TeluguStop.com
మనదేశంలో కోతులు ఆకలైతే ఇంట్లోకి లేదా షాపుల్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడం చాలా కామన్.
అయితే ఫారెన్ కంట్రీస్ లో కోతులు కాదు కానీ ఎలుగుబంట్లు( Bears ) కోతుల వలె చాలా తెలివిగా దొంగతనాలు చేస్తుంటాయి.
బేకరీ షాపుల్లోకి( Bakery ) రావడం, ఎంచక్కా ఏదో ఒక ఫుడ్ ఐటమ్ నోట కరుచుకొని ఎవరూ చూడకుండా తప్పించుకోవడం వంటి సంఘటనలు ఇప్పటికే చాలానే జరిగాయి.
అయితే తాజాగా ఒక ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చి మరీ ఫ్రిడ్జ్ డోర్ తీసి లాసాగ్నే అని పిలిచే ఆహారం కొట్టేసింది.
దీనికి సంబంధించిన వీడియో ఆ ఇంటిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. """/" /
దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ ఎలుగుబంటి కనెక్టికట్ లోని( Connecticut ) బార్ఖమ్‌స్టెడ్ ప్రాంతంలో ఉన్న ఇంటిలోకి చొరబడిందని వీడియో షేర్ చేసిన వారే వెల్లడించారు.
ఫ్రీజర్ డ్రాయర్‌లలో ఒకదానిని తన ముందు కాళ్లతో లాగే నోటితో ఫ్రొజెన్ లాసాగ్నే దొరకబుచ్చుకున్నట్లు వీడియోలో కనిపించింది.
వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే ఒక పెద్ద బ్లాక్ కలర్ ఎలుగుబంటి ఇంటిలో ఆహారం కోసం వెతుకుతూ ఉండటం మీరు గమనించవచ్చు.
"""/" /
ఇది ఒక ఆడ ఎలుగుబంటి అని తెలిసింది.ఇది ఫ్రిడ్జ్ డోర్ వద్దకు వెళ్లిన తర్వాత అందులో ఫుడ్ ( Food ) ఉన్నట్లు వాసన పసిగట్టింది.
ఆ తర్వాత మనిషి తీసినట్లే డోర్ తీసి లాసాగ్నే ప్యాకెట్ నోటితో పట్టుకుంది.
అనంతరం ఆ తీసిన ఫ్రిడ్జ్ డోర్ పైనే కాలుపెట్టి తెరిచి ఉన్న కిటికీ లోనుంచి దూకి పారిపోయింది.
ఇంటి యజమాని, రిచర్డ్‌సన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ఎలుగుబంటి గురించి రింగ్ డోర్‌బెల్ తనకు తెలియజేసిందని చెప్పారు.
ఆ సమయంలో తాను ఆఫీసులో ఉన్నానని వివరించారు.
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్