విదేశీ విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం షాక్.. దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఈ-మెయిల్స్

అమెరికన్ యూనివర్సిటీలు,( US Universities ) విద్యాసంస్థలలో గత కొద్దినెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా విద్యార్ధులు రెండు గ్రూపులుగా విడిపోయి నిరసనలకు దిగారు.

ఈ ఘటనలతో శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకున్నాయి.డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇలాంటి నిరసనలు చేసేవారికి వార్నింగ్ ఇచ్చారు.

విద్యార్ధుల నిరసనలకు అనుమతులు ఇస్తున్న విద్యాసంస్ధలకు ఫెడరల్ నిధులు నిలిపివేయడంతో పాటు విద్యార్ధులను అరెస్ట్ చేసి వారిని స్వదేశాలకు బహిష్కరిస్తామని హెచ్చరించారు ట్రంప్.

దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు విద్యార్ధులను సైతం దేశం నుంచి బహిష్కరించింది.భారతీయ విద్యార్ధులు( Indian Students ) ఈ అల్లర్లలో పాల్గోనడంతో పలువురిని బహిష్కరించగా.

మరికొందరు సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా దేశాన్ని వీడారు.భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాస్( Ranjani Srinivas ) తనకు తానుగా సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా బహిష్కరణ విధించుకున్నారు.

మరో విద్యార్ధి బహిష్కరణపై కోర్ట్ స్టే విధించడంతో ఆయన విషయంలోనూ ఏదో ఒక నిర్ణయం వెలువడనుంది.

"""/" / విదేశీ విద్యార్ధులపై( International Students ) మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా ట్రంప్ ప్రభుత్వం పావులు కదుపుతోంది.

కేవలం నిరసనల్లో పాల్గొన్నవారే కాకుండా సామాజిక మాధ్యమాల్లో మద్ధతు తెలిపిన వారు, నిరసనల దృశ్యాలు, ఫోటోలను షేర్ చేసిన వారికి కూడా ఇదే రకమైన శిక్ష విధించాలని నిర్ణయించింది.

ఇలాంటి వారంతా స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్( US State Department ) ఈ మెయిల్స్ పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా నుంచి ఇవి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

"""/" / నిరసనలకు మద్ధతు ఇచ్చిన వారిని కనుగొనేందుకు విదేశీ విద్యార్ధుల సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్నారు అమెరికా అధికారులు.

వీరు అలాంటి పనులు చేసినట్లుగా తేలితే తక్షణం అమెరికాలో చదువుకునే అవకాశం లేకుండా దేశం నుంచి బహిష్కరించాలని భావిస్తున్నారు.

ఈ మెయిల్స్ అందిన తర్వాత వారంతట వారు స్వచ్ఛందంగా అమెరికాను వీడాలని, ఇందుకోసం సీబీపీ యాప్ వినియోగించాలని అధికారులు తెలిపారు.

ఈ పరిణామాలు అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులకు ఆందోళన కలిగిస్తున్నాయి.