కేరళలో మహిళల నరబలి.. ఎందుకు చేశారంటే..

మనం నేటి సమాజంలో ఇంత స్మార్ట్ గా జీవిస్తున్న మన దేశంలో చాలా రాష్ట్రాలలో బంగారు నిధుల కోసం నరబలి లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

తాజాగా కేరళలో నరబలి జరిగిన సంఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది.ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయి మరణించారు.మరణించిన ఇద్దరు మహిళలు ఎర్నాకుళం జిల్లాకు చెందినవారు.

వీరిని తిరువల్లకు తీసుకువచ్చి బలి ఇచ్చినట్లు సమాచారం.ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

వీరు వరసగా భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ లుగా గుర్తించారు.

మహిళలను అక్రమంగా తరలించిన ఏజెంట్, జంటను కూడా అరెస్టు చేశారు.తిరువళ్లకు చెందిన భగవత్, పెరుంబవూరుకు చెందిన అతని భార్య లీల, పెరుంబవూరుకు చెందిన షిహాబ్ లు వీరందరినీ కూడా నరబలి కేసులో అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలీసుల విచారణలో తెలిసిన వివరాల ప్రకారం పెరుంబవూరులోని ఏజెంట్ స్త్రీలను తిరువళ్లకు తీసుకురావడంలో సహాయం చేసేవాడు.

తిరువళ్లలో అష్టైశ్వర్యాలతో తులతూగాలనే కోరికతో ఈ నరబలి చేసినట్లు తెలిసింది. """/" / నరబలి ఇచ్చిన ఇద్దరి మహిళల మృతదేహాలను ఖననం చేశారు.

ఈ ప్రాంతంలో అష్టైశ్వర్యాలను సంపాదించాలనే కోరికతో నరబలి ఇచ్చిన సంఘటన కేరళలో ఎప్పుడు జరగలేదు.

అక్షరాస్యత అధికంగా ఉండే కేరళలో నరబలి లాంటి మూఢనమ్మకం ఘటన వెలుగు చూడడం సంచలనం రేపుతోంది.

పోలీసులకు తెలిసిన వివరాల ప్రకారం ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించి తిరువళ్లకు చెందిన భగవత్‌ను కలిశారు.

పెరుంబవూరుకు చెందిన వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో గొప్ప లాభాలు వస్తాయని ఫేస్‌బుక్ ద్వారా భగవత్‌ను నమ్మించాడు.

దీని తర్వాత, మహిళను కలాడి నుండి తిరువళ్లకు తీసుకెళ్లారు.ఈ మహిళ మొబైల్ టవర్ లొకేషన్‌ తో దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణ తిరువళ్లలో ముగింపుకు వచ్చింది.

8 ఏళ్ల వయసులో శవం తో కొన్ని గంటలు బంధింపబడ్డ హీరో ఇతనే..!