కౌశిక్ రెడ్డికి ' కారు ' సీటు ' దొరక్కపోతే ? షర్మిలమ్మే దిక్కా ?

ఒకే ఒక్క ఫోన్ కాల్ ఒక యువనేత రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది.

పదేళ్లుగా కాంగ్రెస్ లోనే ఉంటూ, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్న హుజురాబాద్ మాజీ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితం అనేక మలుపులు తిరుగుతోంది.

హుజురాబాద్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు సరేనా ప్రత్యర్థిగా మొదటి నుంచి కౌశిక్ రెడ్డి పేరు వినిపిస్తూ వస్తోంది.

ఆయన అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరని కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు పార్టీలు భావించాయి.అయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి మాత్రం కౌశిక్ రెడ్డి కి టికెట్ ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టం లేకపోవడం, ఆయన పై అనేక అనుమానాలు ఉండడం, అదే సమయంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు జరపడం, తదితర కారణాలతో కాంగ్రెస్ కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వదనే అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది.

"""/"/ ఇక ఆయన టిఆర్ఎస్ లో చేరబోతున్నారు అనుకుంటున్న సమయంలోనే కౌశిక్ రెడ్డి బిజెపి నాయకుడికి ఫోన్ చేసి తనకే టిఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయ్యింది అని చెప్పడం, ఆ తర్వాత రోజు కార్యకర్తలకు డబ్బులు ఖర్చు పెట్టే అంశం పైన ఆయన మాట్లాడడం, ఆ ఆడియో లు వైరల్ అవ్వడం వంటివి బాగా కౌశిక్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.

దీనిపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది.దీనిపై కౌశిక్ రెడ్డి కి నోటీసులు ఇవ్వడం, వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేసి రేవంత్ పైన విమర్శలు చేశారు.

అయితే వెంటనే టిఆర్ఎస్ లో చేరుతారని అనుకున్నా, టిఆర్ఎస్ మాత్రం కౌశిక్ ను చేర్చుకునే విషయంలో సైలెంట్ అయిపోయింది.

"""/"/ కాంగ్రెస్ తోనే ఉంటూ, టిఆర్ఎస్ కు అనుకూలంగా ఆయన వ్యవహరించారనే విషయం నియోజకవర్గంలో ప్రచారం కావడం వంటి వ్యవహారాలు కారణంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కౌశిక్ రెడ్డి విషయాన్ని టిఆర్ఎస్ పక్కన పెట్టింది.

అసలు కౌశిక్ ను ఇప్పుడు టిఆర్ఎస్ లో చేర్చుకుంటారా ? చేర్చుకుంటే టికెట్ ఇస్తారా లేదా అనే విషయం కౌశిక్ రెడ్డి వర్గానికి కూడా అంతుపట్టడం లేదు.

ఒకవేళ టికెట్ దక్కని క్రమంలో కొత్తగా షర్మిల పెట్టిన వైఎస్సార్ టీపీలోనూ ఆయన చేరేందుకు సిద్ధం అవుతున్నారట.

కాకపోతే చివరి నిమిషం వరకు టిఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే అప్పుడు మాత్రమే చివరి ఆప్షన్ గా వైఎస్సార్ టీపీని పరిగణలోకి తీసుకోవాలనేది కౌశిక్ అభిప్రాయమాట.

ఇప్పటికే కౌశిక్ రెడ్డి తో షర్మిల పార్టీ నాయకులు మంతనాలు చేసినట్టు సమాచారం.

వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?