గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ షాక్.. హిట్ టాక్ వచ్చినా ఆ రేంజ్ కలెక్షన్లు కష్టమేనా?

పుష్ప ది రూల్ మూవీ( Pushpa The Rule Movie ) రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి బెనిఫిట్ షోలు, భారీ టికెట్ రేట్లు కారణం అనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ ఇప్పటికే 1500 కోట్ల రూపాయలకు( 1500 Crore For Rs ) పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలొ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి మాత్రమే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి గేమ్ ఛేంజర్ ( A Game Changer )సినిమాపై ఉంది.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది.ఒకవైపు దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయని చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇకపై బెనిఫిట్ షోలు , సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పుకొచ్చారు.

తాను ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం టికెట్ రేట్లు పెంచనని సీఎం కామెంట్లు చేశారు.

"""/" / తెలంగాణ సీఎం కామెంట్ల నేపథ్యంలో మొదట భారీగా నష్టపోయే సినిమా ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.

ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది.

భారీ టికెట్ రేట్లు ఉంటే మాత్రమే ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

గేమ్ ఛేంజర్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా పుష్ప2 రేంజ్ కలెక్షన్లు కష్టమేనని చెప్పవచ్చు.

"""/" / గత కొన్నేళ్లలో నైజాం మార్కెట్ భారీగా పెరగగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోతే ప్రేక్షకులకు మేలు జరిగిన నిర్మాతలు కొన్ని సందర్భాల్లో నష్టపోయే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మారే అవకాశం ఉందేమో చూడాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ మేకర్స్ కు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఒకింత షాకేనని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.