పెళ్లి తర్వాత కాజల్ కు షాక్.. ఆ చెత్త రికార్డుతో..?
TeluguStop.com
సినిమా రంగంలో కొంతమంది హీరోయిన్లకు ఫెళ్లి తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుందనే సంగతి తెలిసిందే.
గ్లామరస్ రోల్స్ లో నటించే హీరోయిన్లకు ఎక్కువగా పెళ్లి తరువాత ఆఫర్లతో పాటు క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది.
గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ కు కొత్త ఏడాదిలో రిలీజైన తొలి సినిమానే భారీ షాక్ ఇచ్చింది.
మోసగాళ్లు సినిమా మిక్స్ డ్ టాక్ తో మొదలై డిజాస్టర్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
చావుకబురు చల్లగా సినిమా తొలిరోజు కోటిన్నర రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సొంతం చేసుకుంటే మోసగాళ్లు సినిమాకు మాత్రం తొలిరోజు కేవలం 40 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.
50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టడం కూడా కష్టమేనని తెలుస్తోంది.
సెలబ్రిటీలు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చినా ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.
"""/"/
కథ, కథనం కొత్తగానే ఉన్నా ప్రేక్షకులు ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కూడా ఈ సినిమాపై కొంతవరకు పడిందని చెప్పవచ్చు.
ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం 87 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని సమాచారం.
ఈ మధ్య కాలంలో భారీ నష్టాలను సొంతం చేసుకున్న సినిమాల్లొ మోసగాళ్లు కూడా ఒక సినిమాగా నిలవడం గమనార్హం.
మోసగాళ్లు ఫ్లాప్ కావడంతో కాజల్ భవిష్యత్తు రాబోయే సినిమాలపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
వీకెండ్ లోనే మోస్తరు కలెక్షన్లను సాధించిన మోసగాళ్లు వీక్ డేస్ లో భారీగా కలెక్షన్లను రాబట్టడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాజల్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తే మాత్రమే ఆమె సినిమాలు హిట్టయ్యే అవకాశం ఉంది.
మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా ఆ పండుగను టార్గెట్ చేశారా?