ఆ చెట్టును కాపాడుకోవడానికి భారీ సెక్యూరిటీ.. ఎందుకంటే

ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో మనుషులతో సంబంధాలు మురుగున పడిపోయి సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నారు.

అయితే ఈ ప్రవాహంలో మన భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలు, వాటి ఆనవాళ్ళు కనుమరిగవుతున్నాయి.వాటిపై పట్టింపు లేక అవి తుడిచి పెట్టుకుపోతున్నాయి.

అయితే మన భవిష్యత్ తరాలకు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు తెలియాలంటే మనం మన చారిత్రిక సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే మనకందరిలో బుద్ధుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు.బుద్ధుడు అంటే బోధి వృక్షం గుర్తుకు వస్తుంది.

అలాంటి గొప్ప ప్రత్యేకత కలిగిన ఆ బోధి వృక్షం ఎక్కడైనా ఉన్నదా, అసలు అటువంటి చెట్లు జీవించి ఉన్నాయా అనేది చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న.

కాని అదృష్టవషాత్తు ఆ బోధి చెట్టు ఇంకా రక్షించబడి ఉంది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ చెట్టుకు ఒక భద్రత అధికారిని ఏర్పాటు చేసి, సంవత్సరానికి రూ.

15 లక్షలు ఖర్చు చేస్తూ ఆ బోధి వృక్షాన్ని కాపడుతున్నది.2012లో శ్రీలంక అధ్యక్షులు మహేంద్ర రాజపక్సే ఈ చెట్టును నాటారు.

24 గంటల భద్రత, ఆ చెట్టు చుట్టూ 15 అడుగుల ఎత్తు వరకు కంచెను ఏర్పాటు చేసి కంటికి రెప్పలా దానిని కాపడుతున్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!