బాలుడితో భారీ కొండచిలువ స్నేహం.. స్విమ్మింగ్‌పూల్‌లో షాకింగ్ వీడియో
TeluguStop.com
పైథాన్ లేదా కొండచిలువ ఒక సాధారణ జీవి కాదు.అది జంతువులైనా, మనుషులైనా కంట పడితే అమాంతంగా మింగేస్తుంది.
చిన్న చిన్న పాములను చూస్తేనే చాలా మంది వణికిపోతారు.అయితే కొందరు మాత్రం కొండచిలువలను చూసినా భయపడరు.
ఇదే కోవలో ఓ బాలుడు స్విమ్మింగ్ పూల్‌లో భారీ కొండచిలువతో ఈత కొడుతున్నాడు.
సోషల్ మీడియాలో ఈ జెయింట్ పైథాన్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వాస్తవానికి, చాలా మంది పిల్లలు ఆ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తుంటారు.ఆ సమయంలో ఓ భారీ కొండచిలువ అక్కడికి వచ్చింది.
స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి చిన్నారులతో ఈత కొట్టింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చిన్నపిల్లలు చిన్న విషయానికైనా భయపడతారు.అందులోనూ పాములను చూస్తే ఆమడ దూరం పారిపోతారు.
అయితే ఐదేళ్ల బాలుడు మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఓ భారీ కొండచిలువతో స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నాడు.
అది పసుపు రంగులో దాదాపు 15 అడుగుల పొడవుతో భయంకరంగా ఉంది. """/"/పెద్ద మనిషిని అయినా అది అమాంతంగా మింగేయగలిగే సామర్థ్యం దానికి ఉంది.
ఆశ్చర్యకరంగా దాని ప్రవర్తన ఉంది.బాలుడితో చాలా స్నేహంగా మెలుగుతోంది.
బాలుడితో పాటు చక్కగా ఈత కొడుతోంది.దీనిని Coralfish12g అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కొందరు నెటిజన్లు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
మరికొందరు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.కొండచిలువలతో స్నేహం ప్రమాదకరమని, అవి ఎప్పుడైనా హఠాత్తుగా మింగేస్తే పెద్దలు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలు వాటితో ఆడుకోకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
బాలయ్య అఖండ సీక్వెల్ వాయిదా పడనుందా.. ఆ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందా?