Cm Jagan : ఆ హామీ అమలు చేయాలని సీఎం జగన్ పై తీవ్ర ఒత్తిడి.. ముందడుగు వేస్తారా?

2024 ఎన్నికలు అటు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఇటు వైసీపీకి కీలకం కానున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలవని పక్షంలో పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని అటు టీడీపీ ఇటు వైసీపీ భావిస్తున్నాయి.

తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత బీ.ఆర్.

ఎస్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందో ఏపీలో ఓడిపోయే పార్టీ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఇలాంటి సమయంలో రైతు రుణమాఫీ( Crop Loan Waiver Scheme ) హామీ విషయంలో జగన్ పై వైసీపీ నేతల నుంచి ఒత్తిడి ఉందని తెలుస్తోంది.

కనీసం లక్ష రూపాయల మేర రుణమాఫీ ప్రకటించినా వైసీపీకి బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ ఇప్పటికే ఈ హామీ అమలు కోసం ఆర్థిక నిపుణులు, బ్యాంక్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

జగన్ ఈ హామీ విషయంలో ముందడుగు వేస్తారో వెనుకడుగు వేస్తారో చూడాల్సి ఉంది.

"""/" / 25 నుంచి 40 నియోజకవర్గాల్లో ఈ హామీ వైసీపీ గెలుపును ప్రభావితం చేసే హామీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇతర హామీలను తగ్గించి ఈ హామీ అమలు దిశగా అడుగు వేస్తే జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని వైసీపీ నేతలు చెబుతున్నారు.

టీడీపీ సైతం ఇదే హామీ దిశగా అడుగులు వేసినా గతంలో టీడీపీ ఈ హామీని సరిగ్గా అమలు చేయలేదనే సంగతి తెలిసిందే.

రైతు రుణమాఫీ 4, 5 విడతల సొమ్మును జమ చేశామని చంద్రబాబు( Chandrababu ) 2019 ఎన్నికల ముందు ప్రకటించినా ఏ ఒక్క రైతు ఖాతాలో ఆ నగదు జమ కాలేదు.

అందువల్ల టీడీపీ ఆ హామీ ఇవ్వడానికి సైతం వెనుకడుగు వేస్తోంది.అతి త్వరలో మేనిఫెస్టో ప్రకటించబోతున్న జగన్ ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వస్తారో చూడాలి.

ఇదేందయ్యా ఇది.. బిఎండబ్ల్యూ కారులో వచ్చి దొంగతనం చేసిన మహిళా