Mahi V Raghav : ఆ రెండు సినిమాల వల్ల కోట్ల రూపాయలు నష్టపోయిన యాత్ర2 డైరెక్టర్.. ఇన్ని దెబ్బలు తగిలాయా?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో యాత్ర2( Yatra 2 ) ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మహి వి రాఘవ్ తను నిర్మాతగా వ్యవహరించిన విలేజ్ లో వినాయకుడు( Village Lo Vinayakudu ), కుదిరితే కప్పు కాఫీ సినిమాల గురించి చెప్పుకొచ్చారు.
వినాయకుడు మూవీ స్పూర్తితోనే విలేజ్ లో వినాయకుడు కథ రాశానని ఆయన వెల్లడించారు.
మనకు తక్కువ తెలిసినప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుందని అలా విలేజ్ లో వినాయకుడు నిర్మించానని మహి వి రాఘవ్ తెలిపారు.
రిలీజ్ కు ముందే వినాయకుడు సినిమాపై నమ్మకం ఉందని ఆయన కామెంట్లు చేశారు.
వినాయకుడు విషయంలో అంచనాలు నిజమయ్యాయని విలేజ్ లో వినాయకుడు నష్టాలు మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు.
సినిమాను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో మాకు తెలియలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆ విషయంలో మేము ఫెయిల్ అయ్యాయని మహి వి రాఘవ్( Mahi V Raghav ) అన్నారు.
విలేజ్ లో వినాయకుడు విషయంలో తప్పులు ఉన్నాయని ఆయన తెలిపారు. """/"/
కుదిరితే కప్పు కాఫీ( Kudirithe Kappu Coffee ) ఒక తప్పు పూడ్చడానికి చేసిన మరో మూవీ అని మహి వి రాఘవ్ వెల్లడించారు.
నేను ప్రొడ్యూసర్ కావాలని ఇండస్ట్రీలోకి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.సినిమాను నిర్మించడం అనేది స్కిల్ అని మహి వి రాఘవ్ అన్నారు.
ఆ రెండు సినిమాలు ఫ్లాపైన తర్వాత రియలైజేషన్ అయిందని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సమయంలో ఇండస్ట్రీని క్విట్ చేద్దామని అనుకున్నానని మహి వి రాఘవ్ కామెంట్లు చేశారు.
"""/"/
ఏ సినిమా అయినా నా వల్ల ఫ్లాపైతే ఆనందం ఉంటుందని ఇతరుల వల్ల పోతే బాధ కలుగుతుందని ఆయన తెలిపారు.
నిర్మించే సినిమాలకు ఎక్కువ సమయం పట్టలేదని మహి వి రాఘవ్ వెల్లడించారు.అందరికీ అన్ని సినిమాలు నచ్చవని ఆయన పేర్కొన్నారు.
మహి వి రాఘవ్ చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?