తెలంగాణకు భారీ పెట్టుబడులు..!

తెలంగాణ రాష్ట్రంలో మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.ఈ మేరకు అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన యూఏఈ దిగ్గజ సంస్థ NNFFCO కంపెనీ రాష్ట్రంలో మొత్తం రూ.

700 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందని తెలుస్తోంది.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ తో కంపెనీ సీఈవో ప్రతినిధి బృందం సమావేశం అయింది.

దాంతో పాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది.

అదేవిధంగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు డీపీ వరల్డ్ సంస్థ రూ.215 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ తో డీపీ వరల్డ్ ప్రతినిధుల బృందం కూడా సమావేశం అయిందని తెలుస్తోంది.

ఆ సమయంలో రాజ్ తరుణ్ ను నేనే పోషించాను.. లావణ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!