శ్రీవారి సర్వదర్శనానికి మూడు కిలోమీటర్ల వరకు క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులు..
TeluguStop.com
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది, శ్రీ వారి సర్వదర్శనానికి భక్తులు మూడు కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ల లో వేచి ఉన్నారు.
తమిళనాడులో పెరటాసి మాసం మొదలైన సందర్భంగా తమిళనాడు నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది, వైకుంఠం క్యూ1 క్యూ2 కాంప్లెక్స్ లన్నీ భక్తులతో నిండిపోవడమే కాక సర్వదర్శనానికి వెళ్లే క్యూ లైన్లులో మూడు కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు,
పెరటాస్ మాసంలో భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దానికి తగినట్టుగా తిరుమల కొండ మీద భక్తులకు ఆహారంతో పాటు మంచినీరు ఇతర అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు.
How Modern Technology Shapes The IGaming Experience