‘లడ్డు ‘ దెబ్బ గట్టిగానే తగిలిందా ? జగన్ కు ఇబ్బందులే 

‘లడ్డు ‘ దెబ్బ గట్టిగానే తగిలిందా ? జగన్ కు ఇబ్బందులే 

తిరుమల లడ్డు వివాదం( Tirupati Laddu )లో వైసిపి అధినేత జగన్ చిక్కుకుని విలవిలాడుతున్నారు.

‘లడ్డు ‘ దెబ్బ గట్టిగానే తగిలిందా ? జగన్ కు ఇబ్బందులే 

చంద్రబాబు రాజకీయ వ్యూహం ముందు జగన్ తేలిపోతున్నారు.తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి మరీ జగన్ ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొట్టారు.

‘లడ్డు ‘ దెబ్బ గట్టిగానే తగిలిందా ? జగన్ కు ఇబ్బందులే 

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు కేవలం 11 స్థానాలనే దర్శించుకుని వైసిపి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇక తరువాత నుంచి వరుసగా పార్టీలోని కీలక నేతలు చాలామంది పార్టీని వీడి వెళ్లిపోవడం వంటివి వైసీపీలో ఆందోళన కు కారణమైంది.

  ఆ వలసల పరంపర కొనసాగుతూ ఉండగానే తిరుమల తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు ఆరోపణలు చేయడం,  దీనికి తగ్గట్లుగా ల్యాబ్ రిపోర్టులను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది.

"""/" / ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచి గుర్తింపు ఉంది.ఇప్పుడు ఈ వివాదంతో జగన్ ( YS Jagan Mohan Reddy )పరువు దేశవ్యాప్తంగా పోయిందనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చి దేశవ్యాప్తంగా చర్చకు చంద్రబాబు తెరతీశారు.లక్ష కోట్ల అవినీతి చేశారని గతంలో అనేక ఆరోపణలు చేసినా, అవేమి జనాలు పట్టించుకోకుండా,  ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు .

"""/" / అయితే ఇప్పుడు శ్రీవారి సెంటిమెంట్ తో కొట్టేసరికి సోషల్ మీడియాలో జగన్ పార్టీకి వ్యతిరేకంగా జనాలు స్పందిస్తున్నారు.

జనాలను మరింతగా జగన్ ను దూరం చేసే విధంగా చంద్రబాబు( CM Chandrababu Naidu ) చేసిన ఆరోపణలతో జగన్ పార్టీ విలువలాడుతోంది.

ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు వెళ్ళిపోతున్నా.ఆ స్థాయిలో సానుభూతి జగన్ కు దక్కేల కనిపించడం లేదు.

దీనికి కారణం జనాలు వైసీపీ నుంచి వెళ్లే వలసలు గురించి కంటే తిరుమల లడ్డు అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

చంద్రబాబు పకడ్బందీ వ్యూహంతో వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు .తిరుమల లడ్డు వివాదం నుంచి కోలుకునేందుకు జగన్ కు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు సీరియస్ గానే ఉండడం,  జగన్ అవసరం లేదన్నట్లుగానే వారు వ్యవహరిస్తుండడంతో అన్ని విధాలుగా జగన్ కు ఇబ్బందికర పరిస్తితిలే ముందు ముందు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి .

గత వైసిపి ప్రభుత్వం లో టీటీడీ బోర్డులో తన సామాజిక వర్గానికి చెందిన వారిని,  బంధువులకు ఎక్కువగా నియమించడం తో ఇప్పుడు గట్టిగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారు.

ఏది ఏమైనా తిరుమల లడ్డు వ్యవహారం జగన్ కు , వైసీపీకి వ్యక్తిగతంగా  భారీగానే డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్న అభిమానులు.. అలా జరగడం సాధ్యమా?