Superstar Krishna : 52 ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ ను దున్నేసిన కృష్ణ.. ఆ కటౌట్స్ ను చూస్తే పూనకాలే!
TeluguStop.com
దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) గురించి మనందరికీ తెలిసిందే.
స్టార్ కృష్ణ గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే.ఇప్పటికి ఘట్టమనేని అభిమానులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
కృష్ణ అప్పట్లో ఎన్నో బ్లాక్ మాస్టర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
తెలుగు వెండితెరకు కొత్త కొత్త సొగసులను అద్దిన ఘనత ఇప్పటికీ, ఎప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ కి సొంతం అని చెప్పవచ్చు.
కాగా ఇప్పుడంటే ఈ పాన్ ఇండియా జపం చేస్తున్నారు కానీ 52 సంవత్సరాల క్రితమే కృష్ణ పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్( Pan World ) ని దున్నేశారు.
"""/"/
ఆయన హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు( Mosagallaku Mosagadu ) చిత్రం అప్పట్లోనే పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మే 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఆయన సోదరుడు ఆది శేషగిరిరావు ఈ సినిమాను మరోసారి సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
"""/"/
ఇండియాలోనే మొదటి కౌబాయ్ సినిమా ఇదే అన్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు ఈ ట్రెండ్ నడిచింది.
కానీ ట్రెండ్ సెట్టర్‌గా మాత్రం కృష్ణ పేరే ఇప్పటికీ చెప్పబడుతోంది.ఇక ఈ సినిమా రీ రిలీజ్‌ను పురస్కరించుకుని అప్పుడే అన్ని చోట్లా సందడి మొదలైంది.
అప్పట్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి సందడి నెలకొందో దాదాపు రీ రిలీజ్‌కు కూడా అదే స్థాయిలో థియేటర్ల వద్ద సందడి మొదలైంది.
సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఇప్పటికే ఆయన జయంతికి సంబంధించిన ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు.
ఈ సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమా విడుదల అయ్యి 52 ఏళ్లు అవుతున్న ఆ సినిమాకు సంబంధించిన కటౌట్లను థియేటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే సినిమా థియేటర్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.
సంచలనం సృష్టించిన త్రిష..