ఆ హీరోల కంటే సుడిగాలి సుధీర్ ఎంతో గ్రేట్.. ఆ రేంజ్ కలెక్షన్లు అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.ఈ హీరోల సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
అయితే ఈ హీరోల సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయా అనే ప్రశ్నకు మాత్రం రావడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫుల్ రన్ లో నష్టాలే వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఆయా హీరోల కంటే సుడిగాలి సుధీర్ ఎంతో గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బ్యాగ్రౌండ్ ఉన్న కొంతమంది హీరోల సినిమాలతో పోల్చి చూస్తే గాలోడు సినిమాకు బెటర్ కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 40 లక్షల రూపాయలకు అమ్ముడైతే ఏకంగా 70 లక్షల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.
నిర్మాతలకు ఏకంగా 30 లక్షల రూపాయలు ఈ సినిమా వల్ల లాభంగా దక్కింది.
గాలోడు సినిమా కథ, కథనాలు మరీ అద్భుతంగా లేకపోయినా సుధీర్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా సక్సెస్ సాధించింది.
ఒకవేళ ఈ సినిమా కథ, కథనాలు సైతం మరీ అద్భుతంగా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ పెరిగి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సుధీర్ జబర్దస్త్ షోకు దూరమైనా అతని కెరీర్ కు ఏ మాత్రం నష్టం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/"/
మరో ఐదేళ్ల పాటు సుధీర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
గాలోడు సక్సెస్ తో సుధీర్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సుడిగాలి సుధీర్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఆయన ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.సుడిగాలి సుధీర్ రష్మీతో కలిసి గజ్జెల గుర్రం అనే సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.
వైరల్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. బ్యాంకు డిపాజిట్ స్లిప్ పై ఏకంగా?