వైసీపీలో భారీ మార్పులు.. నేతలకు స్థానచలనం

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి.ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను సీఎం జగన్ మార్చగా మరి కొంతమంది నేతలకు స్థానచలనం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇందులో భాగంగానే సుమారు 15 మంది సిట్టింగ్ ఎంపీలకు అసెంబ్లీ సీట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అలాగే 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇవ్వడంతో పాటు 30 మందికి పైగా కొత్తవారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నుంచి నాలుగు స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయని సమాచారం.

రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో ఇప్పటికే ఏడు స్థానాలు ఎస్టీ, 29 స్థానాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారన్న సంగతి తెలిసిందే.

మిగిలిన 139 సీట్లలో సుమారు యాభై సీట్ల వరకు బీసీలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?