భారీ నగదు స్వాధీనం

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా , పోలీసులు తనిఖీల్లో బుధవారం భారీగా నగదు పట్టుబడింది.

సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీసులు హుజూర్ నగర్( Huzur Nagar ) మిర్యాలగూడ రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కోదాడ నుండి బ్యాంకు ఉద్యోగి చీరాల సాయికుమార్ వద్ద రూ.

45 లక్షలు,కోదాడ మండల పరిధిలోని రామాపురం ఎక్స్ రోడ్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో నాగారం మండలం ఈటూరుకు చెందిన చేపల వ్యాపారి నర్ల నరేష్ కుమార్( Narla Naresh Kumar ) మారుతి సుజుకి వాహనంలో పడవలు కొనుగోలు చేసేందుకు తీసుకెళ్తున్న రూ.

1.50 లక్షలు,మరో ఘటనలో నాగపూర్ కు చెందిన అతావుల్లా ఖాన్ గ్రానైట్ కొనుగోలు చేసేందుకు ప్రకాశం జిల్లా మార్టూరుకు తీసుకుపోతున్న రూ.

1.96 లక్షలు,తమ్మర స్టేజి వద్ద అనంతగిరి పోలీసులు హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెంకి చెందిన ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావు వద్ద రూ.

7.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నగదును విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ కు అందజేశారు.ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో మాచర్లకు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి మాచర్ల వైపు నుండి పైలాన్ కాలనీ వస్తుండగా అతని వద్ద రూ.

1,42,800 సరైన పత్రాలు లేకుండా తరలిస్తుండగా సిఐ బిసన్న ఎస్సై సంపత్ గౌడ్ స్వాధీనం చేసుకున్నారు.

లొకేషన్ పంపినా బేఖాతరు .. గోల్డీ బ్రార్‌ను రక్షిస్తోన్న కెనడా? వెలుగులోకి సంచలన విషయాలు