మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు నివాసంలో భారీగా నగదు సీజ్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు నివాసంలో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

తెల్లవారుజాము నుంచి మంత్రి నివాసం, కాలేజీలతో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల నగదును సీజ్ చేశారు.

ఉదయం నుంచి సుచిత్రలో ఉన్న త్రిశూల్ రెడ్డి ఇంటిలో తనిఖీలు చేస్తున్నారు.కాగా త్రిశూల్ రెడ్డి పలు కాలేజీలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అఖండ సీక్వెల్ లో ఆ ఒక్క సీన్ కు పూనకాలు పక్కా.. థమన్ హామీ ఇచ్చేశారుగా!