సూర్యాపేట జిల్లాలో భారీగా గృహలక్ష్మి దరఖాస్తులు…!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి నిర్మాణం కోసం ఇటీవల ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో జిల్లా వ్యాప్తంగా మండల రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులు ప్రజల నుండి భారీగా దరఖాస్తులు స్వీకరించారు.

ఈ పథకానికి ముందుగా మూడు రోజులే గడువని ప్రకటంచిన ప్రభుత్వం ప్రజల నుండి వచ్చే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని నిరంతర ప్రక్రియ అంటూ ప్రకటించింది.

దీనితో జిల్లాలో గృహలక్ష్మి దరఖాస్తులు ఇంకా కొనసాగుతున్నాయి.ఇప్పటి వరకు అధికారులకు అందిన దరఖాస్తుల వివరాలు మున్సిపల్,మండలాల వారిగా ఈ విధంగా ఉన్నాయి.

సూర్యాపేట నియోజకవర్గం నుండి.సూర్యాపేట రూరల్ 2,745,సూర్యాపేట టౌన్ 2,604,చివ్వెంల 2,825 ,పెన్ పహాడ్ 2,834, ఆత్మకూర్ (ఎస్) 2,832 ,దరఖాస్తులు రాగా.

తుంగతుర్తి నియోజకవర్గం నుండి, తుంగతుర్తి 2,873, నూతనకల్ 2,000, మద్దిరాల 2,066, తిరుమలగిరి 2,166 నాగారం 2,378 వచ్చాయి.

కోదాడ నియోజకవర్గం నుండి కోదాడ రూరల్ 1,850, కోదాడ పట్టణం 1,959, మునగాల 1,827, నడిగూడెం 2,194, అనంతగిరి 2,273,మోతె 2,618,చిలుకూరు 2,146రాగా.

హుజూర్ నగర్( Huzur Nagar ) నియోజకవర్గం నుండి హుజూర్ నగర్ రూరల్ 1,010,హుజూర్ నగర్ పట్టణం 1,038,గరిడేపల్లి 2,956,నేరేడుచర్ల 1,460, నేరేడుచర్ల పట్టణం 741, పాలకవీడు 1602, మఠంపల్లి 2,567, మేళ్లచెరువు 1,741, చింతలపాలెం 1,497 దరఖాస్తులు వచ్చాయి.

సూర్యాపేట జిల్లా( Suryapet ) వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల నుండి శనివారం వరకు ప్రజల నుండి అధికారులకు అందిన మొత్తం గృహలక్ష్మి పథకం( Gruha Lakshmi ) దరఖాస్తుల సంఖ్య 54,802 కు చేరింది.

ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతుండగా మరో వైపు సోమవారం నుండి దరఖాస్తలను మొదలుపెట్టి అర్హులను గుర్తించనున్నట్లు సమాచారం.

అయితే అధికారుల వెరిఫికేషన్ లో ఇందులో ఎన్ని దరఖాస్తులు ఉంటాయో, ఎన్ని పక్కన పెట్టేసే అవకాశం ఉందో అర్థంకాక దరఖాస్తుదారులు అయోమయంలో పడగా, దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఉసూరుమనిపించిన గుజరాత్ ఎన్ఆర్ఐల డిపాజిట్లు .. కారణమిదేనా..?