Ram Pothineni : రామ్, బోయపాటి సినిమా అప్డేట్.. మగధీరను మించి ఫైట్ సీన్స్?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ( Ram Pothineni )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హీరో రామ్ పోతినేని గత ఏడాది ది వారియర్ ( The Warrior )సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

డైరెక్టర్ లింగుస్వామి( Director Linguswamy ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇకపోతే హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ( Boyapati Srinu )దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

"""/" / కాగా ఈ సినిమాలో ఊర మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు రామ్ పోతినేని.

ఇకపోతే డైరెక్టర్ బోయపాటి సినిమాల గురించి మనందరికీ తెలిసిందే.డైరెక్టర్లలో మాస్ కి మొగుడు అంటే ముందుగా బోయపాటి పేరే వినిపిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒకప్పుడు ఇరవై మంది వుంటే భారీ ఫైట్ అనేవాళ్ళు.కానీ మగధీరతో ఈ లెక్క వందకి చేరింది.

తర్వాత వంద కూడా దాటేసే భారీ యాక్షన్ సీన్లు తెరపై కనిపించాయి. """/" / ఇది ఇలా ఉంటే ఇప్పుడు మార్క్ ని 1500 కి చేర్చారు డైరెక్టర్ బోయపాటి.

రామ్ పోతినేను,బోయపాటి కలయికలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ వుంది.

ఈ సీన్ లో 1500 మంది ఫైటర్స్ కనిపిస్తారని తెలుస్తోంది.1500 మందితో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు.

ఈ రోజు నుంచే ఈ ఫైట్ చిత్రీకరణ ప్రారభించారు.పది రోజుల పాటు ఈ ఫైట్ ని షూట్ చేస్తారు.

అఖండకి అదిరిపోయే యాక్షన్ అందించిన స్టంట్ శివ ఈ ఫైట్ కి యాక్షన్ కొరియోగ్రఫర్.

ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెల్లటి మెరిసే చర్మం కోసం బెస్ట్ ఫ్రూట్ మాస్క్ ఇది.. కచ్చితంగా ప్రయత్నించండి!