అధిక రక్తపోటు కంట్రోల్ అవ్వాలా? అయితే బచ్చలికూరే బెస్ట్ అప్షన్!
TeluguStop.com
అధిక రక్త పోటు.దీనినే హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని కూడా పిలుస్తుంటారు.
అధిక రక్త పోటు బారిన పడితే.ఓ పట్టాన ప్రశాంతంగా ఉండలేరు.
ఎందుకంటే.తలనొప్పి, గుండె దడ, ఛాతిలో నొప్పి, తీవ్రమైన అలసట, తెలియని గందరగోళం, శ్వాస తీసుకోవడంలో సమస్య, అధిక నీరసం ఇలా ఎన్నో లక్షణాలు అధిక రక్త పోటు బాధితులను ఇబ్బంది పెడుతుంటాయి.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేశామా.అంతే సంగతులు.
అవును, అధిక రక్త పోటును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పుగా మారుతుంది.ఒక్కో సారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే ఎంత త్వరగా రక్తపోటు స్థాయిలను అదుపులోకి తెచ్చుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా సహాయపడతాయి.అలాంటి వాటిలో బచ్చలికూర కూడా ఉంది.
ఆరోగ్యానికి నెచ్చలిగా ఉండే బచ్చలి కూరలో.కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, బీటాకెరాటిన్, సెలీనియం, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోషకాలు నిండి ఉంటాయి.
"""/" /
అందుకే వారానికి రెండు సార్లు అయినా బచ్చలికూర తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అందులో ముఖ్యంగా అధిక రక్తపోటు కంట్రోల్ చేయడంలో బచ్చలికూర ఒక మెడిసిన్‌లా పని చేస్తుంది.
బచ్చలి కూరతో తయారు చేసిన వంటలను డైట్‌లో చేర్చుకుంటే.అందులో ఉండే ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు అధిక రక్త పోటును కంట్రోల్‌లోకి తెస్తాయి.
"""/" /
బచ్చలిని జ్యూస్ రూపంలో తీసుకుంటే రక్త పోటుకు మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
పైగా బచ్చలికూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.అందువల్ల, బరువు పెరిగిపోతామన్న భయమే ఉండక్కర్లేదు.
మరియు బచ్చలి కూరను తీసుకుంటే.రక్త హీనత దూరం అవుతుంది.
గుండె ఆరోగ్యం పెరుగుతుంది.బ్రెయిన్ కూడా షార్ప్‌గా మారుతుంది.