ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసిన హెచ్‌పీసీఎల్.. 200 పోస్టులు ఖాళీ.. !
TeluguStop.com
ఆకలిగొన్న పులుల్లా తయారు అయ్యింది దేశంలోని నిరుద్యోగుల పరిస్దితి.ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివిన ఎందరో తాము చదివిన చదువులకు సంబంధం లేని పనులతో పొట్ట పోసుకుంటున్నారు.
మరి కొందరైతే ఆత్మాభిమానం చంపుకోలేక చదివిన ఉన్నత చదువుల ను గుర్తుతెచ్చుకుంటూ ఉపాధి పనులకు వెళ్లుతున్నారు.
బ్రతకాలంటే దొరికిన ఏ పనైనా చేయవలసిన అవసరం దేశంలోని చాలమంది యువకులకు, పట్టబద్రులకు ఉంది.
ఇలాంటి నేపధ్యంలో ఉద్యోగానికి సంబంధిచిన నోటిఫికేషన్ ఏదైనా వస్తే చాలు కుప్పలు కుప్పలుగా అప్లికేషన్స్ ఉంటాయి.
ఇకపోతే నిరుద్యోగులకు ఒక చిన్న ఉద్యోగ అవకాశాన్ని కలిగిస్తుంది హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).
ఈ సంస్దలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
"""/"/
ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 120, సివిల్ ఇంజినీర్ 30, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 25, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్ 25 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
ఇక ఈ ఉద్యోగాలకు అర్హతలుగ సంబంధిత గ్రూపులో నాలుగేండ్ల ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలని పేర్కొంటుంది.
అయితే రాతపరీక్ష, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుండగా, ఆన్ లైన్ లో రూ.
1180, అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుందట.కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదని, ఆసక్తి గల అభ్యర్దులు ఏప్రిల్ 15 వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలియచేస్తుంది.
బాలయ్య డాకు మహారాజ్ మూవీ నుంచి మరో ట్రైలర్ రాబోతుందా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్!