వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాన్ని నాని చేస్తే ఎలా ఉండేది?

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చింది.

పెద్ద ఎత్తున అంచనాలున్నా కూడా ఈ సినిమా మినిమం వసూళ్లను కూడా రాబట్టే పరిస్థితి లేదు.

విజయ్‌ దేవరకొండ వద్దకు ఈ కథతో దర్శకుడు క్రాంతి మాధవ్‌ మూడు సంవత్సరాల క్రితం వెళ్లాడు.

ఆ సమయంలో వరుసగా చిత్రాలు చేస్తున్న కారణంగా ఈ చిత్రం ఆలస్యం అయ్యింది.

అయితే క్రాంతిమాధవ్‌ ఈ చిత్రం కథతో మొదట నాని వద్దకు వెళ్లాడట. """/"/మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా హిట్‌ అవ్వడంతో నాని కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపించాడట.

కాని కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు యువ హీరోలకు దర్శకుడు ఈ కథను వినిపించడం జరిగింది.

కాని ఎవరికి కూడా దీన్ని చేసేంతటి ధైర్యం లేకపోయింది.ఈ సమయంలోనే విజయ్‌ దేవరకొండకు స్టోరీ లైన్‌ నచ్చడంతో ఓకే చెప్పాడు.

"""/"/విజయ్‌ దేవరకొండ కోసం వెయిట్‌ చేసిన క్రాంతి మాధవ్‌ ఎట్టకేలకు పూర్తి చేసి సినిమాను విడుదల చేశాడు.

కాని సినిమా నిరాశ పర్చడంతో నాని ఈ సినిమా చేయనందుకు హమయ్య అనుకుంటున్నాడట.

నాని మంచి సినిమాను మిస్‌ అయ్యాడని మొన్నటి వరకు అనుకన్నవారు ఇప్పుడు నాని జడ్జ్‌మెంట్‌ను అభినందిస్తున్నారు.

వైరల్: ఇందుకే కాబోలు సచిన్ ను క్రికెట్ గాడ్ అనేది..