Anchor Suma : షూట్ పూర్తయ్యాక సుమ పరిస్థితి అలా ఉంటుందా.. పాపం ఎంత కష్టపడుతుందో?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, యాంకర్లు చూడ్డానికి బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ కనిపిస్తుంటారు కానీ.
ఆ ఎంటర్టైన్మెంట్ వెనకాల ఉన్న కష్టం మామూలుగా ఉండదు.మన కోసం గంటలు తరబడి నటనలో జీవించేస్తూ ఉంటారు.
ముఖ్యంగా యాంకర్ల విషయం తీసుకుంటే వాళ్లకు ఓపిక, సహనం అన్ని ఎక్కువే.ఎన్ని గంటలైనా సరే వాళ్ళు యాంకరింగ్ ను చేస్తూ ఉండాలి.
సినీ ఈవెంట్లలో మాత్రం వారి పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ ఈవెంట్ పూర్తయ్యే వరకు పదేపదే మాట్లాడటం, నిలబడటం, గంటలు తరబడి మైకు చేతుల పట్టుకోవడం ఇలా వారికి ఇవన్నీ కష్టమే అని చెప్పాలి.
కానీ చూసే వాళ్ళకు మాత్రం వాళ్ల కష్టం కనిపించదు.వాళ్లు చేసే ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కనిపిస్తుంది.
అయితే తాజాగా యాంకర్ సుమ( Anchor Suma ) ఒక వీడియో షేర్ చేసుకోగా అందులో.
షూట్ పూర్తయ్యాక తన పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పకనే చెప్పేసింది.ఇంతకు ఆ వీడియోలో ఏముందో చూద్దాం.
టాలీవుడ్( Tollywood ) ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
టాలీవుడ్ లో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు సంపాందించుకుంది.స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ యాంకర్ సుమ సంపాదించుకుంది.
ఇక ఈమెకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకొని ఒక లెవెల్ లో దూసుకెళ్తుంది.
"""/" /
ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది.
"""/" /
ప్రస్తుతం బుల్లితెరపై సుమ అడ్డా షో లో( Suma Adda Show ) బాగా బిజీగా ఉంది.
ఈమె మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.
పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్ యాంకర్.
స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
"""/" /
ఇక సుమ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
అయితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తను మేకప్ వేసుకున్నాక ఎలా ఉంటుందో షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఎలా ఉంటుందో చూపించింది.
అయితే షూటింగు ప్యాకప్ అయ్యాక సుమ పూర్తిగా బ్యాటరీ లో అయినట్లుగా చూపించింది.
దీంతో ఆ వీడియో చూసిన తన అభిమానులు.పాపం సుమ ఎంత కష్టపడుతుందో అని.
షూటింగ్ పూర్తయ్యాక పరిస్థితి అలా ఉంటుందా అంటూ బాధపడుతున్నారు.