వావ్ . . ఈ పంతులమ్మ పిల్లలకు పాఠాలు ఎంత బాగా చెబుతోందో.. (వీడియో)

ప్రస్తుత రోజుల పిల్లల టాలెంట్( Children's Talent ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకు తగ్గట్టే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్స్ కూడా అలానే ఉండాలి.వారికి బోధించే సమయంలో అనేక ప్రయత్నాలు, వివిధ రకాల పిల్లలకు వివరించే విధానం చేస్తున్నారు కొందరు.

ఈ క్రమంలో తాజాగా బీహార్( Bihar ) కు చెందిన ఒక టీచర్ పిల్లలకు బోధిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆ టీచర్ స్కూల్లో పాఠాలు చెప్పే విధానం నిజంగా అద్భుతమని చెప్పాలి.ఆ టీచర్ పిల్లలకు బోధించే తీరుకు పిల్లలు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు.

ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.

"""/" / ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని బంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి( Khushboo Kumari ) అనే ఉపాధ్యాయురాలు కాథోన్ ( Cathon )అనే ఈ మిడిల్ స్కూల్‌ లో గణితం తోపాటు మిగితా సబ్జెక్టులు సరదాగా పిల్లలకు బోధిస్తుంది.

ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియోలో.

, ఉపాధ్యాయురాలు ఖుష్బూ ఆనంద్ తన చేతి సంజ్ఞలతో పాఠశాల విద్యార్థులకు హిందీ ఒత్తులను చాలా బాగా చాకచక్యంగా వివరిస్తోంది.

ఈ హిందీ ఒత్తులను పిల్లలకు వివరించే విధానం నిజంగా అద్భుతం. """/" / సోషల్ మీడియా లో వీడియోను షేర్ చేస్తూ , ‘పిల్లల పరిమాణం, అవగాహన మంచి మార్గంలో అభివృద్ధి చెందాలంటే.

కొన్నిసార్లు మనం కూడా పిల్లలుగా మారాలి.పిల్లలుగా మారి, పిల్లలకు నేర్పించాలి.

ఈ బోధన అభ్యాస ప్రక్రియలో సహాయం చేయడం చాలా గొప్పది.ఆనందాన్ని ఇస్తుంది" అంటూ రాసుకొచ్చింది.

ఈ టీచర్ బోధించే పద్ధతి నెటిజన్స్ తో పాటు పిల్లల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ వీడియోకు ఒక వ్యక్తి ‘విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో, ఆసక్తికరంగా చేయడంలో మీరు ఎంతో విజయం సాధించారు’ అంటూ కామెంట్ చేసారు.

కల్కి సినిమాలో ఆ రోల్ ను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయిగా!