ఈ కుక్క ఎంత‌బాగా దాగుడు మూత‌లు ఆడుతుందో..

నిజానికి ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క‌లు కూడా సేమ్ మ‌నుషుల్లాగే ఎమోష‌న్‌ను చూపిస్తుంటాయి.

ఇవి ఇత‌ర జంతువుల కంటే కూడా మ‌నుషుల‌కే ఎక్కువ‌గా అట్రాక్ట్ అవుతుంటాయి.ఇక వీటికి సంబంధించిన ఫన్నీ వీడియోలు, అలాగే ఎమోష‌న‌ల్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతుంటాయి.

మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే నెటిజ‌న్ల‌ను ఎక్కువ‌గా పెంపుడు కుక్కలే ఆక‌ట్టుకుంటాయి.ఇవి త‌మ య‌జ‌మానుల‌పై చూపించే ప్రేమ‌, బాధ‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేమ‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో చిన్న పిల్ల కుక్కతో దాగుడు మూత‌ల గేమ్ ఆడుతున్నట్లు మ‌న‌కు కనిపిస్తుంది.

ప్ర‌స్తుతం స్కూళ్లు మూసివేయ‌డంతో చిన్నారులు అంతా కూడా ఇలా ఆట, పాటలు అన్నీ కూడా ఇంట్లోనే కొన‌సాగిస్తున్నారు.

ఇక ఇప్పుడు చూడ‌బోయే వీడియోలో కూడా ఓ చిన్నారి ఇలాగే త‌న పెంపుడు కుక్క‌తో ఇంట్లోనే దాగుడు మూతలు ఆడుతోంది.

అయితే ఆ కుక్క‌కూడా ఆశ్చ‌ర్య పోయేలా హైడ్ అండ్ సిక్ ఆడుతోంది. """/"//di మ‌నం ఎలా ఆడుతామో ఆ కుక్కు కూడా అలాగే దాగుడు మూత‌లు ఆడుతోందంటే నిజంగా మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేక‌పోతున్నాం అనే అనిపిస్తోంది.

ఆమె త‌న పెంపుడు కుక్కను వెళ్లి గోడ దగ్గరకు వెళ్లి 1,2,3 లెక్క‌పెట్ట‌మ‌ని చెప్తుంది.

ఇక ఆ కుక్క కూడా అలాగే గోడ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏవో లెక్క‌బెడుతున్న‌ట్టు చేస్తుంది.

ఇక వెంట‌నే ఆ చిన్నారి ఓ రూమ్‌లోకి వెల్లి దాక్కుంటుంది.ఇక ఆ తరువాత కుక్క కూడా చిన్నారి వెళ్లిన రూమ్‌లోకి వెళ్లి త‌న‌ను క‌నుక్కుంటుంది.

ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి దానిపై.

హైదరాబాద్ లో బిల్డర్ కిడ్నాప్, హత్య..!!