జీసస్ ఎవరికి ఎలా పుట్టారు... మరో వివాదానికి తెరలేపిన పూనమ్ కౌర్?
TeluguStop.com
సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలు ఏ చిన్న వ్యాఖ్యలు చేసిన ఒక్క చిన్న పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.
ఇలా కొందరు చేసే ట్వీట్ ల వల్ల పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగడం వల్ల కూడా కొందరు నిత్యం వార్తల్లో నిలుస్తూ గుర్తింపు పొందిన వారు ఉన్నారు.
అలాంటి వారిలో నటి పూనమ్ కౌర్ ఒకరు.ఈమె నటించిన సినిమాల సంఖ్య తక్కువగా అయినప్పటికీ వివాదాలతో ఎంతో గుర్తింపు పొందారు.
ఈమె చేసే ప్రతి ఒక్క ట్వీట్ ఎంతో వివాదంగా మారుతూ ఉంటుంది.ఇప్పటికే పూనమ్ చేసిన ట్వీట్ల వల్ల పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగిన విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా నటి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ మరోసారి వివాదానికి కారణం అవుతుంది.
ఈసారి ఏకంగా దేవుళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఈమె కుల మతాల మధ్య చిచ్చు రేపారని చెప్పాలి.
తాజాగా ఈమె ట్విట్టర్ వేదికగా క్రైస్తవుల ఆరాధ్య దైవం జీసస్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
జీసస్ ఎవరికి పుట్టారు? ఎలా పుట్టారు? ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
"""/" /
తాను పెద్దగా చదువుకోలేదని అందుకే ఇలాంటి విషయాలు తనకు తెలియవంటూ ఈ సందర్భంగా ఈమె జీసస్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది క్రైస్తవులు ఈమె పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా జీసస్ గురించి ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే క్రైస్తవులు తీవ్ర వ్యతిరేకత చూపిస్తారు అలాంటిది ఈమె సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నటిపై ట్రోలింగ్ చేస్తున్నారు.
మొత్తానికి జీసస్ గురించి ఈమె ప్రశ్నిస్తూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి.
ఢిల్లీ-ఆగ్రా రైలులో డచ్ మహిళను వేధించిన కామాంధుడు.. ఇతనికి సిగ్గు లేదా?