వాణిశ్రీ కి ఆ పేరు ఎవరు పెట్టారు.. దీని వెనక ఇంత కథ ఉందా ?

రత్నకుమారి అనే ఒక హీరోయిన్ ఉండేది అని చెప్తే మీలో ఎవరైనా గుర్తు పడతారా ? కానీ వాణిశ్రీ( Vanisri ) అంటే మాత్రం మొన్నటి, నిన్నటి తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.

ఆమె కళాభినేత్రిగా సౌత్ ఇండియాలోనే లేడీ సూపర్ స్టార్ గా కొనసాగారు.మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న మరొక హీరోయిన్ గా వాణిశ్రీ కి మంచి పేరు దక్కింది.

ఇక వాణిశ్రీ మొదట చాల చిన్న పాత్రల్లో నటించింది.హీరోయిన్ గా ఎదగడానికి కొంచం టైం పట్టింది.

అయితే ఆమె అసలు పేరు మాత్రం రత్న కుమారి.నెల్లూరు లో పుట్టిన వాణిశ్రీ కుటుంబం మద్రాసుకు మారడం తో అప్పట్లో నాటకాలతో తన కెరీర్ ని మొదలు పెట్టింది.

"""/" / అప్పట్లో భారతదేశం మెచ్చిన నాటకాల్లో ఆమె నటించింది.రక్తకన్నీరు లో హీరోకి భార్యగా, చిల్లర కొట్టు చిట్టెమ్మ లో చిట్టెమ్మ పాత్రలు పోషించింది.

ఇక ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం బంగారు పంజరం.( Bangaru Panjaram ) అయితే వాణిశ్రీ కి ఆ పేరు పెట్టింది మాత్రం నటుడు ఎస్వీ రంగారావు బ్యానర్ లో కావడం విశేషం.

అయన సొంత బ్యానర్ వాణి ఫిలిమ్స్ అని ఉండేది.అందులో నటిస్తున్న క్రమం లో ఎస్వీ రంగారావు ఆమెకు తన బ్యానర్ పేరు అయినా వాణి కి శ్రీ అనే పదం జోడించి వాణిశ్రీ అనే పేరు పెట్టారు.

ఆలా తెరపైన మహానటుడు అయినా ఎస్వీఆర్ తో నామకరణం చేయించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

"""/" / ఆమె తెలుగు తెరకు చివరి లేడీ సూపర్ స్టార్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అంతకన్నా ముందు సావిత్రి కి మాత్రమే ఆ పేరు దక్కింది.ఆ తర్వాత కాలంలో అంతటి నటి మళ్లి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పుట్టలేదు.

అంత అద్దెకు తెచ్చుకున్న నటీమణులు.లేదంటే వారసత్వం, మరి కాదంటే రికమండేషన్ బ్యాచ్.

ఇలా ఎదో ఒక విధంగా ఇండస్ట్రీ కి రావడం కొన్ని సినిమాల్లో నటించి కనిపించే కుండా వెళ్లిపోవడం జరిగేది.

వాణిశ్రీ వంటి మహానటి మళ్లి పుట్టడం ఇక జరగదు కూడా.ఇక వాణిశ్రీ దసరా బుల్లోడు( Dasara Bullodu )ప్రేమ నగర్ వంటి సినిమాలతో నవల నాయకి అనే పేరు కూడా సంపాదించుకున్నారు.

పట్టుదలతో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రాజశేఖర్.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!