Vadde Naveen : మొదట ఆ సినిమాలో వడ్డే నవీన్ హీరో…మార్చడానికి కారణం ఏమిటంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు వడ్డే నవీన్.
( Vadde Naveen ) ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
అందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాలను ఓకే చేసుకుంటూ అప్పట్లో యూత్ లో ఒక మంచి క్రేజ్ ను అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన పెళ్లి, మా బాలాజీ, చాలా బాగుంది లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక దాంతోపాటుగా ఆయనకు మార్కెట్ కూడా భారీగా పెరిగింది. """/" /
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు మొత్తం వరుసగా విజయాలను అందుకున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే శ్రీకాంత్( Srikanth ) హీరోగా రాశి హీరోయిన్ గా వచ్చిన 'ప్రేయసి రావే '( Preyasi Raave Movie ) సినిమాలో మొదట హీరోగా వడ్డే నవీన్ ను తీసుకోవాలని అనుకున్నారు.
కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమాలో మళ్ళీ శ్రీకాంత్ హీరోగా చేయాల్సి వచ్చింది.
అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన చంద్ర మహేష్( Chandra Mahesh ) మొదట నవీన్ ను హీరోగా తీసుకుందామని అనుకున్నారట.
కానీ డాక్టర్ డి రామానాయుడు మాత్రం శ్రీకాంత్ అయితే బాగుంటాడు అని చెప్పడంతో శ్రీకాంత్ ను తీసుకొని ఈ సినిమాని చేశారని అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
ఇక ఈ సినిమాని కనక వడ్డే నవీన్ చేసినట్లయితే ఆయన కెరియర్ లో ఒక మంచి హిట్ అయితే పడేది.
"""/" /
ఇక ప్రేయసి రావే సినిమాతో శ్రీకాంత్ సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా అప్పటివరకు ఫ్లాప్ ల్లో ఉన్న ఆయనకి ఒక మంచి హిట్ సినిమా అయితే పడిందనే చెప్పాలి.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా శ్రీకాంత్ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు క్యారెక్టర్ గా మారిన ఆయన స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
దోతీ కట్టుకోవడం నచ్చక సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు