Trisha Krishnan : త్రిష ఈరోజుకి స్టార్ హీరోయిన్ గా ఉండటానికి కారణం అయిన సినిమా ఏంటో తెలుసా ?
TeluguStop.com
త్రిష.( Trisha )నలభై ఏళ్ళ బ్యూటిఫుల్ హీరోయిన్.
2002 లో తొలిసారి హీరోయిన్ గా మౌనం పెసియాదే చిత్రం ద్వారా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పరిచయం అయ్యింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రం నీ మనసు నాకు తెలుసు( Nee Manasu Naku Telusu ) అనే చిత్రం ద్వారా పరిచయం అయినా వర్షం చిత్రం ఆమెకు మొదటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది.
ఈ సినిమాతోనే ఆమె తొలిసారి ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది.కెరీర్ మొత్తం మీద ఇప్పటికే 70 సినిమాలకు పైగా నటించిన త్రిష కెరీర్ 20 ఏళ్లకు పైగా కొనసాగడం చాల పెద్ద విషయం.
ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ అయినా కూడా ఐదు లేదా ఆరు ఏళ్లకు మించి కెరీర్ ని కొనసాగించలేక పోతున్నారు.
"""/"/
కానీ త్రిష ఇరవై ఏళ్లుగా సినిమాల్లో బిజీ గానే ఉంది.ఇప్పటికి ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయ్.
అందులో ఒకటి మలయాళ సినిమా కాగా మూడు తమిళ సినిమాలు కావడం విశేషం.
చాల సార్లు మీడియాలో లేదంటే సోషల్ మీడియా( Social Media )లో త్రిష పని అయిపోయింది అన్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయ్.
అలా వచ్చిన ప్రతి సారి కూడా త్రిష రెట్టించిన ఉత్సాహం తో తిరిగి సినిమాల్లో బిజీ అవుతూనే ఉంది.
ఇక 2016 లో దాదాపు నాలుగు సినిమాలతో త్రిష తెరమీద కనిపించగా, 2017 లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.
ఆ టైం లో త్రిష కెరీర్ పరంగా చాల డౌన్ అయ్యిది కూడా.
అప్పటికే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది.కెరీర్ ఎలాగూ డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి లైఫ్ లో అయినా పెళ్లి తో సెటిల్ అవ్వాలని అనుకుంది.
"""/"/
కానీ ఆమె పెళ్లిని బ్రేక్ చేసి మళ్లి సినిమాల్లో బిజీ అయ్యింది.
ఆమెను ఈ సారి మళ్లి లేవడానికి 96 మూవీ( 96 Movie ) కారణం.
ఈ సినిమా తెలుగు లో జాను పేరు తో సమంత మరియు శర్వానంద్ హీరో హీరోయిన్స్ గా రీమేక్ చేసారు.
అయితే 96 మూవీ చాల పెద్ద విజయం సాధించడం తో మరోమారు ఆమె కెరీర్ నిలబడింది.
అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు పొన్నియన్ సెల్వన్( Ponniyin Selvan ) చిత్రాలతో ఫుల్ ట్రేండింగ్ గా మారిపోయింది.
మే 4 న పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రిష వయసు ఇప్పుడు 40 ఏళ్ళు .