Rice Flour : మీ మెడ ఎంత డార్క్ గా ఉన్నా సరే 2 స్పూన్ల బియ్యం పిండితో ఇలా చేశారంటే తెల్లగా మెరిసిపోవాల్సిందే!
TeluguStop.com
డార్క్ నెక్( Dark Neck )ఎంతో మందిని కలవరపెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
దీర్ఘకాలిక వ్యాధులు, పరిశుభ్రత పాటించకపోవడం, మృత కణాలు పేరుకుపోవడం, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల మెడ చుట్టూ చర్మం నల్లగా మారుతుంటుంది.
దీంతో ముఖం తెల్లగా మృదువుగా ఉన్నా కూడా డార్క్ నెక్ వల్ల కాంతిహీనంగానే కనిపిస్తారు.
అయితే మెడ నలుపును వదిలించడానికి కొన్ని కొన్ని ఇంటి చుట్కాలు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.
అందులో ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఒకటి. """/" /
ఈ రెమెడీని పాటించారంటే చాలా సులభంగా మెడ నలుపును వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( Rice Flour )ని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్, మూడు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వేళ్ళతో సున్నితంగా మెడను స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.
ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను మెడకు అప్లై చేసుకోవాలి.ఈ రెమెడీని రోజుకు ఒకసారి కనుక ప్రయత్నించారంటే మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.
డార్క్ నెక్ తెల్లగా మరియు అందంగా మెరిసిపోతుంది.మెడ చుట్టూ చర్మం నల్లగా ఉందని బాధపడుతున్న వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
అలాగే కొందరికి అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉంటాయి.అలాంటి వారు కూడా ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.
ఇది డార్క్ నెస్ ను దూరం చేసి చర్మాన్ని మృదువుగా కోమలంగా మారుస్తుంది.
పబ్లిక్‌లో రొమాన్స్.. పోలీసుల రియాక్షన్ ఇదే