అందాన్ని పెంచే టమాటో.. వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా వాడాలంటే?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటో( Tomato ) ఒకటి.

టమాటోను ఇతర కూరగాయలతో కలిపి వండుతుంటారు.అలాగే వివిధ రకాల వంటల్లో టమాటోను వాడతారు.

ఆరోగ్యపరంగా టమాటో ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే అందాన్ని పెంచే సత్తా కూడా టమాటోకు ఉంది.

ఈ నేపథ్యంలోనే టమాటోతో ఎలాంటి స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ పొందవచ్చు.? అసలు చర్మానికి టమాటోను ఏ విధంగా వాడొచ్చు.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్( White And Glowing Skin ) కోసం ఆరాటపడుతూ ఉంటారు.

అలాంటివారు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు( Papaya Fruit ) ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.

ఇలా రోజుకు ఒకసారి కనుక చేశారంటే చ‌ర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

"""/" / అలాగే స్కిన్ స్మూత్ గా మరియు షైనీ గా మారాలంటే ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ( Aloe Vera Gel )వేసుకుని బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం పది నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ప్రకాశవంతంగా తయారవుతుంది.

"""/" / చర్మంపై మొండి మచ్చలు ఉన్నాయని బాధపడుతున్న వారు రెండు టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీకి వన్ టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తే చర్మం పై మొండి మచ్చలు మాయం అవుతాయి.

ఇండియన్ బార్బర్‌తో వెరైటీగా మసాజ్ చేయించుకున్న రష్యన్ గర్ల్.. వీడియో వైరల్..