సమ్మర్‌లో చందనంను ఇలా వాడితే చర్మం మెరిసిపోవడం ఖాయం!
TeluguStop.com
ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఆరోగ్యంతో పాటు చర్మాన్ని సైతం సురక్షితంగా కాపాడుకోవడం ఎంత కష్టతరమో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.
ముఖ్యంగా చర్మం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.సన్ ట్యాన్, డ్రై స్కిన్, స్కిన్ టోన్ తగ్గిపోవడం, మొటిమలు, అధిక జిడ్డు ఇలా ఏదో ఒక సమస్య వచ్చి ఇబ్బంది పెడుతుంది.
అందుకే వేసవిలో ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.అయితే అందుకు చందనం అద్భుతంగా సహాయపడుతుంది.
చందనం పొడిలో ఉండే కొన్ని ప్రత్యేక సుగుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
సమ్మర్‌లో ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.మరి ఇంతకీ చందనంను చర్మానికి ఎలా వాడాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ పాల పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు మూడు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్ వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు మరియు చేతులకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది.
సన్ ట్యాన్ సమస్య దూరం అవుతుంది.మరియు ఆయిలీ స్కిన్ వేధించకుండా ఉంటుంది.
"""/"/
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, రెండు టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.కాసేపు ఆరబెట్టుకోవాలి.
ఆపై వేళ్లతో స్మూత్‌గా స్క్రబ్ చేసుకుంటూ వాటర్‌తో వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.
పవన్ త్రివిక్రమ్ కాంబోలో పొలిటికల్ మూవీ.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!