మరింతకీ సబ్జా గింజలు చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు మరియు అరకప్పు వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి.
అలాగే కొన్ని ఫ్రెష్ గులాబీ రేకులు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( Milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేశారంటే మీ చర్మంలో మార్పులు చోటు చేసుకుంటాయి.
సబ్జా గింజల్లో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపుతాయి.
క్లియర్ స్కిన్ ను అందిస్తాయి.అలాగే సబ్జా గింజల్లో ఉండే విటమిన్ ఈ ముడతలు, చర్మం సాగడం, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.
చర్మం యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే గులాబీ రేకులు, పాలు, అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.
గ్లోయింగ్ గా మెరిపిస్తాయి.అందమైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తాయి.