హెయిర్ గ్రోత్‌ను డ‌బుల్ చేసే పైనాపిల్‌.. ఇలా వాడితే ఊహించ‌ని బెనిఫిట్స్ మీసొంతం!

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఫ్రూట్స్ లో పైనాపిల్( Pineapple ) ఒకటి.

ప్రస్తుత వర్షాకాలంలో పైనాపిల్ పండ్లు విరివిరిగా లభ్యం అవుతుంటాయి.అనేక పోషకాలను కలిగి ఉంటే పైనాపిల్ ఆరోగ్యపరంగా మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

గుండెపోటు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి ఎన్నో జ‌బ్బుల‌కు అడ్డుకట్ట వేస్తుంది.అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా పైనాపిల్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా.

? అవును మీరు విన్నది నిజమే. """/" / ముఖ్యంగా హెయిర్ గ్రోత్( Hair Growth ) ను డబుల్ చేయడానికి పైనాపిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.

ఇప్పుడు చెప్పబోయే విధంగా పైనాపిల్ ను వాడితే ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసమే ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/" / వారానికి ఒక్కసారి ఈ పైనాపిల్ హెయిర్ ప్యాక్( Pineapple Hairpack ) వేసుకుంటే బోలేదు ప్రయోజనాలు పొందుతారు.

పైనాపిల్ లో ఉండే ప్రోటీన్ మరియు విటమిన్స్ హెయిర్ గ్రోత్ ను రెట్టింపు చేస్తాయి.

జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా ప్రోత్స‌హిస్తాయి.అలాగే పెరుగు లో ఉండే విటమిన్ బి, లాక్టిక్ యాసిడ్ హెయిర్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి.

మ‌రియు అలివ్ అయిల్‌ స్కాల్ప్ ను హెల్తీగా, హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.కాబ‌ట్టి ఒత్తైన, ఆరోగ్య‌మైన జుట్టును కోరుకునే వారు త‌ప్పుకుండా ఈ పైనాపిల్ హెయిర్ ప్యాక్ వేసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.