ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?

ఓట్స్.( Oats )పోషకాలకు పవర్ హౌస్ లాంటివి.

ఆరోగ్యపరంగా ఓట్స్ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.బరువు నిర్వహణలో అద్భుతంగా తోడ్పడతాయి.

పలు దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తాయి.అందుకే ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఓట్స్ ను త‌మ డైట్ లో చేర్చుకుంటున్నారు.

అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఓట్స్ ఎంతో అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా హెయిర్ గ్రోత్ ( Hair Growth )ను పెంచే సత్తా ఓట్స్ కు ఉంది.

మరి అందుకోసం ఓట్స్ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి ఒక చిన్న కప్పు కొబ్బరి పాలు( Coconut Milk ) పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఓట్స్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్,( Egg White ) రెండు టేబుల్ స్పూన్ బాదం నూనె( Almond Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

న‌ల‌భై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ ఓట్స్ హెయిర్ మాస్క్( Oats Hair Mask ) వేసుకుంటే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఓట్స్, కొబ్బరి పాలు, ఎగ్ వైట్, బాదం నూనెలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఇతర పోషకాలు జుట్టు ఆరోగ్యానికి అండగా నిలబడతాయి.

హెయిర్ గ్రోత్ ను చ‌క్క‌గా ఇంప్రూవ్ చేస్తాయి.ప‌ల్చ‌టి జుట్టును ఒత్తుగా మారుస్తాయి.

అంతేకాదు ఈ ఓట్స్ మాస్క్ చిట్లిన జుట్టును రిపేర్ చేస్తుంది.కురుల‌ను సిల్కీగా, స్మూత్ గా మారుస్తుంది.

హెయిర్ రూట్స్ ను స్ట్రోంగ్ గా మార్చి జుట్టు రాల‌డాన్ని సైతం అడ్డుకుంది.

కాబ‌ట్టి ఆరోగ్య‌మైన ఒత్తైన కురుల కోసం త‌ప్ప‌కుండా ఈ ఓట్స్ మాస్క్ ను ప్ర‌య‌త్నించండి.

అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుంటే నడిరోడ్డులో కనిపించిన సింహం.. చివరికి?