ఆరోగ్యానికే కాదు ఓట్స్ జుట్టు రాలడాన్ని కూడా అరికడతాయి.. తెలుసా?
TeluguStop.com
ఓట్స్.ఇటీవల రోజుల్లో వీటి వినియోగం భారీగా పెరిగిపోయింది.
ముఖ్యంగా హెల్తీ డైట్ ను ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటారు.
వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఓట్స్( Oats ) తో బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఓట్స్ ఉపయోగపడతాయి.ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఓట్స్ అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.
మరి ఇంతకీ జుట్టుకు ఓట్స్ ను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి ఒక కప్పు పాలు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఓట్స్ ను పాలతో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( Curd )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే ఓట్స్ లో ఉండే జింక్, ఐరన్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటి పోషకాలు మీ జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తాయి.
జుట్టు రాలడాన్ని అరికడతాయి.హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీని పాటిస్తే ఈజీగా సమస్య నుంచి బయటపడతారు.
పైగా ఈ రెమెడీ వల్ల మీ జుట్టు సిల్కీగా మారుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
మరియు జుట్టు చిట్లడం సైతం కంట్రోల్ అవుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ తో సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.
వీడియో వైరల్.. అక్కడ భోజనం వండిన గౌతమ్ అదానీ