కీళ్ల నొప్పుల నివారిణి కరక్కాయ.. ఎలా వాడాలో తెలుసా?
TeluguStop.com
కీళ్ల నొప్పులు.( Knee Pains ) వయసు పైబడిన వారే కాదు ఇటీవల రోజుల్లో వయసులో ఉన్నవారు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.
కీళ్ల నొప్పులు తాత్కాలికంగా ఉండొచ్చు లేదా దీర్ఘకాలిక సమస్యగా కూడా మారవచ్చు.అధిక బరువు, ఆర్థరైటిస్, గౌట్, ఇన్ఫెక్షన్లు, వయసు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, గాయాలు వంటివి కీళ్ల నొప్పులు తలెత్తడానికి ప్రధాన కారణాలు.
అయితే కీళ్ల నొప్పుల నివారణకు కరక్కాయ( Myrobalan ) చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.
ఆయుర్వేదంలో కరక్కాయను అత్యంత విలువైన ఔషధంగా పరిగణిస్తారు.కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారు పావు టీ కరక్కాయ పొడిని కొంచెం తేనెలో( Honey ) కలిపి రోజు ఉదయం, రాత్రి తీసుకోవాలి.
లేదా కషాయం తయారు చేసి తీసుకోవచ్చు.కరక్కాయ పొడిని నీటిలో మరిగించి, వడకట్టి తాగాలి.