చర్మ కాంతిని పెంచే కివీ పండు.. ఇలా వాడితే ఎలాంటి సమస్యలున్నా పరార్!

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో కివీ( Kiwi ) ఒకటి.

ఖరీదు కాస్త ఎక్కువే అయినా కివీ పండ్లలో అందుకు తగ్గా పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.

విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఈ, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కివీ ద్వారా పొందవచ్చు.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మకాంతిని పెంచడానికి కూడా కివీ పండు ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కివీ పండును వాడితే ఎలాంటి చర్మ సమస్యలున్నా పరార్ అవ్వాల్సిందే.

"""/" / అందుకోసం ముందుగా ఒక కివీ పండును తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పాలు( Milk ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకొని ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

కివీ పండులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు మన చర్మ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.

"""/" / పైన చెప్పిన విధంగా కివీ పండుతో తరచూ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే.

మొటిమలు వేధించకుండా ఉంటాయి.మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

పిగ్మెంటేషన్ సమస్య( Pigmentation Problem ) నుంచి విముక్తి లభిస్తుంది.స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.

అలాగే ఎల్లప్పుడూ చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.కాబట్టి మచ్చలేని అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

ఆ సాంగ్ వచ్చే సమయానికి ప్రభాస్ థియేటర్ కు పంపాడు.. హంసా నందిని కామెంట్స్ వైరల్!