Hibiscus Leaves : నాలుగు మందార ఆకులతో ఇలా చేశారంటే మీ జుట్టు రెండింతలు అవ్వడం ఖాయం!

హెయిర్ ఫాల్( Hair Fall ) కార‌ణంగా మనలో చాలా మంది జుట్టు రోజురోజుకు పల్చగా తయారవుతుంది.

శతవిధాల ప్రయత్నించి జుట్టు రాలడాన్ని అడ్డుకోగలుగుతారు.కానీ పల్చబడిన జుట్టును మళ్లీ ఒత్తుగా మార్చుకోవడం ఎలాగో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.

మందార ఆకులతో( Hibiscus Leaves ) చాలా సులభంగా కురులను ఒత్తుగా మార్చుకోవచ్చు.

ఉన్న జుట్టును రెండింతలు చేసుకోవచ్చు.మరి ఇంతకీ మందార ఆకులను ఎలా ఉపయోగించాలి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నాలుగు మందార ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న మందారం ఆకులు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Cloves ), వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్( Tea Powder ) వేసుకొని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసి మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

"""/" / గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే హెయిర్ గ్రోత్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.

ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా మారతాయి.

మందారం ఆకులు, లవంగాలు, టీ పొడి మరియు విటమిన్ ఈ ఆయిల్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.

ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ టానిక్ ను వాడండి.

డబుల్ హెయిర్ గ్రోత్ ను మీ సొంతం చేసుకోండి.

ఒంట్లో కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!