గ్రీన్ టీలో ఇవి కలిపి రాశారంటే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది..!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పానీయాల్లో గ్రీన్ టీ ఒకటి.ఆరోగ్యపరంగా గ్రీన్ టీ(Green Tea) చేసే మేలు అంతా ఇంతా కాదు.
వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్(weight Loss To Sugar Control) వరకు అనేక ప్రయోజనాలు గ్రీన్ టీ ద్వారా పొందవచ్చు.
ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉదయం మామూలు టీ, కాఫీలకు(tea ,coffee) బదులుగా గ్రీన్ టీ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు.
అయితే గ్రీన్ టీ ఆరోగ్యానికి మాత్రమే కాదు కురుల సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.
ముఖ్యంగా చుండ్రు (Dandruff)ను నివారించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది.గ్రీన్ టీ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్(Antibacterial) సమ్మేళనాలు చుండ్రును సంపూర్ణంగా నివారిస్తాయి.
స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.మరి ఇంతకీ గ్రీన్ టీ ని చుండ్రు నివారణకు ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్(Green Tea Bag) వేసి ఐదు నిమిషాల పాటు ఉంచితే గ్రీన్ టీ రెడీ అవుతుంది.
"""/" /
ఇప్పుడు ఈ గ్రీన్ టీ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్(Lemon Juice) మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్(Coconut Oil) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
దాంతో ఒక హెయిర్ స్ప్రే రెడీ అవుతుంది.ఈ హెయిర్ స్ప్రేను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
"""/" /
వారానికి ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే చుండ్రు అన్న మాటే అనరు.
గ్రీన్ టీ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు లెమన్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడతాయి.
కొబ్బరి నూనె స్కాల్ప్ ను హైడ్రేట్ గా ఉంచడానికి తోడ్పడుతుంది.అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ స్ప్రేను వాడటం వల్ల జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
శంకర్ ఇక రిటైర్మెంట్ అవ్వడం బెటరా..?