తెలుగులో గూగుల్ పే... వాడటం ఎలానో తెలుసా?

ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీ యుగంలో ప్రతీది ఆన్ లైన్ అయిపోయింది.ఆన్ లైన్ వల్ల చెడు ఎంతగా ఉందో.

మంచి అంతకంటే ఎక్కువగా ఉంది.టెక్నాలజీ వల్ల సమయం చాలా ఆదా అవుతుంది.

ఆన్ లైన్ వచ్చిన తర్వాత సమయం వృథా కాకుండా సెకన్లలో ఏ పనినైనా చేసుకోగలుగుతున్నాము.

ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా.మన అకౌంట్లలో డబ్బులు వేసుకోవాలన్నా.

ఇలా బ్యాంక్ సేవలు ఏది పొందాలన్నా సరే.బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సి వచ్చేది.

బ్యాంకుల వద్ద కస్టమర్ల రద్దీ వల్ల క్యూలో నిలబడాల్సి వచ్చేది.ఏదైనా పని కావాలంటే గంటలు గంటలు సమయం పట్టేది.

దాని వల్ల సమయం కూడా చాలా వృథా అయ్యేది.కానీ టెక్నాలజీ వల్ల బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయి.

డబ్బులు వేరేవారికి సెండ్ చేయాలన్నా.బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలన్నా.

ఇలా ఏదైనా సరే మన మొబైల్ లోనే జరిగిపోతుంది.గతంలో తక్కువ మంది మాత్రమే మొబైల్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించగా.

కరోనా వల్ల ఆన్ లైన్ బ్యాంకు సేవలను వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

యూపీఐ సేవలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.దీంతో పాటు అనేక యపీఐ యాప్స్ ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి.

అయితే పేటీఏం, ఫోన్ పేతో పాటు గూగుల్ పేను ఎక్కువమంది వినియోగిస్తూ ఉంటారు.

గూగుల్ పే టాప్ పొజిషన్ లో ఉంది.దీంతో యూజర్ల కోసం గూగుల్ పే అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది.

"""/"/ అందులో భాగంగా ఇంగ్లీష్ తో పాటు ఇండియాలోని అన్ని ప్రాంతీయ భాషల్లో యాప్ ను వాడుకునేలా ఫీచర్ ను తీసుకొచ్చింది.

తెలుగులో కూడా గూగుల్ పే సేవలను తీసుకొచ్చింది.మరి తెలుగులో గూగుల్ పే ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా.

దీని కోసం ముందుగా గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.

అనంతరం పర్సనల్ ఇన్పో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.క్లిక్ చేయగానే లాంగ్వేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

లాంగ్వేజ్ ఆప్షన్ లో తెలుగును ఎంచుకుంటే సరిపోతుంది.తెలుగును ఎంచుకోవగానే గూగుల్ పే తెలుగులోకి మారుతుంది.