కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

ఖర్జూరం.తియ్య‌టి రుచితో పాటు బోలెడు పోషకాలను కలిగి ఉంటుంది.

హెల్త్ పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.రోజుకు రెండు ఖర్జూరాలు తింటే రక్తహీనత, గుండెపోటు, హై బీపీ.

ఇలా అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.అయితే ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఖర్జూరాలు ఉపయోగపడతాయి.

ముఖ్యంగా కలర్ ను పెంచేందుకు ఖర్జూరం గ్రేట్ గా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఖర్జూరంను వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం స్కిన్ టోన్ ను పెంచుకోవడానికి ఖర్జూరంను ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి.

అలాగే అర కప్పు హోమ్ మేడ్ బాదం పాలు పోసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పదార్థాలు పాలతో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండే రెండు సార్లు ఈ ఖర్జూరం ఫేస్ ప్యాక్ ను కనుక వేసుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు.

"""/" / ముఖ్యంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కచ్చితంగా జరుగుతుంది.స్కిన్ కలర్ క్రమంగా పెరుగుతుంది.

అదే సమయంలో చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.ముడతలు, చారలు వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

స్కిన్ టైట్ అవుతుంది.మచ్చలు ఏమైనా ఉన్నా సరే త‌గ్గు ముఖం పడతాయి.

పైగా ఈ రెమెడీ వల్ల చర్మం హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది.కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.

జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. అశ్వనీదత్ కూతురు కామెంట్స్ వైరల్!