కరివేపాకుతో ఇలా చేస్తే గ్యాస్ సమస్య దెబ్బకు ఎగిరిపోతుంది!

గ్యాస్.‌.

సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యల్లో ఇది ఒకటి.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు గ్యాస్ పట్టేసింది రా అని అంటుంటారు.

మీరు కూడా ఈ సమస్యను ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు.గ్యాస్ సమస్య( Gas Problem ) కారణంగా కడుపు ఉబ్బరంగా మారిపోతుంది.

ఆకలి లేకపోవడం, వికారం, త్రేన్పులు, గుండెల్లో మంటగా అనిపించడం, ఆయాసం.వంటివి గ్యాస్ లక్షణాలు.

గ్యాస్ పట్టేసినప్పుడు దాదాపు అందరూ మెడికల్ షాప్ కి వెళ్లి మందులు తెచ్చుకుని వేసుకుంటారు.

లేదా టానిక్స్ తాగుతుంటారు.అయితే సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

గ్యాస్ సమస్యను నిమిషాల్లో నివారించడానికి కరివేపాకు అద్భుతంగా సహాయపడుతుంది.కరివేపాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ఎలాంటి గ్యాస్ సమస్య అయినా దెబ్బకు ఎగిరిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు కరివేపాకు( Curry Leaves )ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్‌ అవ్వగానే అందులో మూడు నుంచి నాలుగు రెబ్బలు కరివేపాకు తుంచి వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము,( Ginger ) చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి మరిగించాలి.

వాటర్ సగం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. """/" / ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )మిక్స్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే నిమిషాల్లో ఉపశమనాన్ని పొందుతారు.

పొట్ట మొత్తం ఫ్రీగా మారుతుంది.త్రేన్పులు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

గుండెల్లో మంట దూరం అవుతుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం మెరుగుపడుతుంది.

నీ ఫోన్ ఆయుష్షు మామూలుగా లేదు సోదరా.. బాలయ్యతో ఫోటోపై నెటిజన్ల కామెంట్స్ వైరల్!