ఆవు, గేదెల పెంపకం కోసం క్రెడిట్ కార్డ్‌ను ఎలా వాడుకోవాలి? కేసిసి ప్రయోజనాలు ఇవే?

భారతదేశం( India ) వ్యవసాయాధారిత దేశం.దేశంలోని అధిక జనాభా ఇక్కడ వ్యవసాయం చేసుకొనే బతుకుతూ వుంటారు.

ఈ క్రమంలో రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేస్తూ వుంటారు.పశుపోషణ నుంచి పాల ఉత్పత్తి ఒక ముఖ్యమైన వ్యాపారం అన్న సంగతి అందరికీ తెలిసినదే.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పశుపోషణను( Animal Husbandry ) ప్రోత్సహించేందుకు రైతులు, వ్యవసాయేతరులను చాలా బాగా ప్రోత్సహిస్తాయి.

పశువుల కొనుగోలుకు మందు, ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి.అదే సమయంలో రైతులకు క్రెడిట్ కార్డులు కూడా అందజేస్తున్నారు.

"""/" / రైతులు, వ్యవసాయేతర పశువుల సంరక్షకులకు బడ్జెట్ లేదు.అలాంటి వారికి ఇపుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ అదిరిపోయే వార్త వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం పశుసంవర్ధక, పాడి, మత్స్య రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు( Kisan Credit Card ) సౌకర్యాన్ని కల్పిస్తోంది.

అవును, దీని కింద దేశ వ్యాప్తంగా ఏహెచ్‌డీఎఫ్ కేసీసీ( AHDF KCC ) ప్రచారాన్ని స్టార్ట్ చేసింది.

క్రెడిట్ కార్డుతో రైతులు 4 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నుంచి క్రెడిట్ కార్డులను అందిస్తోందనే విషయం చాలా కొద్దిమందికి తెలుసు.

కాగా ఇప్పటి వరకు 27 లక్షల మందికి పైగా రైతులకు రుణ కార్డులు అందించారు.

"""/" / ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రచారం షురూ చేసింది.

లక్షన్నర మంది కొత్త రైతులు అందులో చేరడం ఆల్రెడీ జరిగిపోయింది.ఈ కొత్త ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం బ్లూప్రింట్ కూడా సిద్ధం చేసింది.

పశుసంవర్ధక, మత్స్య శాఖ, పాడిపరిశ్రమ శాఖ, పశుసంవర్ధక, ఆర్థిక సేవల విభాగం పాడి, చేపల పెంపకందారులకు క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను అందించడానికి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

ఈ ప్రచారం మే 1, 2023 నుండి ప్రారంభమవుతుంది.మార్చి 2024 వరకు కొనసాగుతుంది.

దీనికి దేశవ్యాప్త AHDF KCC ప్రచారం అని పేరు పెట్టారు.ఇందుకోసం బ్యాంకుతోపాటు ఇతర శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

గురుపత్వంత్ హత్యపై అంతర్జాతీయ మీడియాలో కథనం.. స్పందించిన అమెరికా