కురులకు అండగా కొబ్బరి నూనె.. ఇంతకీ ఏయే సమస్యకు ఎలా వాడాలో తెలుసా?

కొబ్బరి నూనె.పూర్వకాలం నుంచి దీనిని వినియోగిస్తున్నారు.

కురుల సంరక్షణకే కాకుండా కొబ్బరి నూనెతో చాలా మంది వంటలు కూడా వండుతుంటారు.

ముఖ్యంగా కేరళ సైడ్ ఏ వంటకమైనా కొబ్బరి నూనెతోనే చేస్తుంటారు.అలాగే ఈ మధ్య హెల్త్, ఫిట్నెస్ పై శ్రద్ధ పెడుతున్న వారు కూడా కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు.

ఆరోగ్య ప్రయోజనాల గురించి పక్కన పెడితే కురులకు కొబ్బరినూనె( Coconut Oil ) అండగా నిలుస్తుంది.

అనేక సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.అయితే కొబ్బరి నూనెను ఏయే సమస్యకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ హెయిర్ ఫాల్.( Hairfall ) స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా ఎందరినో మదన పెట్టే కామన్ సమస్య ఇది.

జుట్టు రాలడాన్ని అడ్డుకోవాలంటే కొబ్బరి నూనె ను నేరుగా రాస్తే సరిపోదు.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం, నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్( Rosemary Essential Oil ) వేసుకొని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ ను స్కాల్ప్ కు అప్లై చేసి కనీసం ప‌ది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

అలాగే చుండ్రు సమస్య( Dandruff )ను నివారించడానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.

అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేయాలి.

రెండు గంటల అనంతరం తల స్నానం చేయాలి.ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.

"""/"/ జుట్టును ఒత్తుగా మార్చడానికి కూడా కొబ్బరి నూనె సహాయపడుతుంది.అందుకోసం ఒక బౌల్ లో ఒక ఫుల్ ఎగ్( Full Egg ) మరియు మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంటన్నర అనంతరం తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

ఇక డ్రై హెయిర్ తో బాధపడేవారు ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, మూడు టేబుల్ స్పూన్లు పెరుగు, ఐదు టేబుల్ స్పూన్లు బనానా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా చేస్తే జుట్టు స్మూత్ అండ్ సిల్కీ గా మారుతుంది.