కురులకు అండగా నిలిచే కొబ్బరి పాలు.. ఇలా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు!

కొబ్బరి పాలు( Coconut Milk ).వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

రుచిలోనే కాదు కొబ్బరి పాలల్లో పోషకాలు సైతం మెండుగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా కొబ్బరి పాలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే కురులకు కూడా కొబ్బరి పాలు అండగా ఉంటాయి.అనేక జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా కొబ్బరి పాలను వాడితే మీ జుట్టు లో నుంచి ఒక్క వెంట్రుక కూడా రాలదు.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు కొబ్బరి పాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు,( Fenugreeks ) కొబ్బరి పాలతో సహా వేసుకోవాలి.

అలాగే రెండు స్పూన్లు అలోవెరా ( Aloevera )జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.

హెయిర్ ఫాల్ సమస్య ( Hair Fall )దెబ్బకు పరార్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది.

స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.చుండ్రు ఉంటే తొలగిపోతుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు, ఒత్తయిన పొడవాటి జుట్టును కోరుకునేవారు, చుండ్రు సమస్యను వదిలించుకోవాలని ప్రయ‌త్నిస్తున్న వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

కేరళ పోలీస్ శాఖ చొరవ .. ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ హెల్ప్ లైన్