శంఖు పుష్పాలు ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుతాయని తెలుసా?
TeluguStop.com
శంఖు పుష్పాల( Butterfly Pea Flowers ) గురించి పరిచయం అక్కర్లేదు.చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ పుష్పాల్లో ఎన్నో రకాల పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందుకే చాలా మంది శంఖు పుష్పాలతో టీ తయారు చేసుకుని నిత్యం తీసుకుంటూ ఉంటారు.
అయితే శంఖు పుష్పాలు ఆరోగ్యాన్నే కాదు జుట్టును( Hair ) కూడా పెంచుతాయి.
వివిధ కేశ సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి.మరి ఇంతకీ కురులకు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది నుంచి పది శంఖు పుష్పాలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టీ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక గ్లాసు హాట్ వాటర్ పోసి బాగా కలపాలి.
ఆపై మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను చేత్తో క్రష్ చేసుకోవాలి.
దాంతో వాటర్ అనేది జెల్ రూపంలోకి మారుతుంది.క్లాత్ సహాయంతో ఆ జెల్ ను సపరేట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తే ఒక మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.
ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకావాలి.
వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే మీ కురులకు చక్కని పోషణ అందుతుంది.
జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.
అదే సమయంలో ఈ టానిక్ జుట్టు ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది.కురులను ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
మరియు జుట్టును సిల్కీగా షైనీ గా సైతం మెరిపిస్తుంది.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుర్రాడిపై కాలు దువ్విన కోహ్లీ.. (వీడియో)