అందాన్ని పెంచే అరటి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?
TeluguStop.com
అరటి ఆకు భోజనం అంటే ఇష్టపడని వారుండరు.అరటి ఆకు భోజనం రుచిగా ఉండటమే కాదు.
ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.అయితే అరటి ఆకు భోజనాన్ని వడ్డించుకుని తినడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటే పొరపాటే అవుతుంది.
ఎందుకంటే, అరటి ఆకుతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు.అరటి ఆకుల్లో ఉండే అమోఘమైన పోషకాలు వివిధ రకాల చర్మ సమస్యలను నివారించి అందాన్ని రెట్టింపు చేస్తాయి.
మరి ఇంతకీ అరటి ఆకును చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చిన్న అరటి ఆకు ముక్కను తీసుకుని వాటర్‌లో శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి ఆకు ముక్కలు, మూడు టేబుల్ స్పూన్ల ఉడికించిన రైస్, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేయాలి.
పూర్తిగా ఆరిన అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ రెమెడీని తరచూ ట్రై చేస్తుంటే ముఖం స్మూత్ అండ్ షైనీగా మారుతుంది.
స్కిన్ టోన్ మెరుగ్గా మారుతుంది. """/"/
అలాగే మరో విధంగా కూడా అరటి ఆకును చర్మానికి ఉపయోగించవచ్చు.
అరటి ఆకును తీసుకున్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ అరటి ఆకు ముక్కలను బ్లెండర్‌లో వేసి వాటర్ సాయంతో మెత్తగా పేస్ట్ చేసి.
జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌ను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్‌ను దూది సాయంతో ముఖానికి అప్లై చేసి.పదిహేను నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే ముదురు రంగు మచ్చలు, మొటిమలు పోయి క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
Birthright Citizenship : ట్రంప్ నిర్ణయంపై భారత సంతతి నేతల ఫైర్