బాదం నూనెతో ఇలా చేస్తే.. మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!

అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలంటే.అనేక జాగ్ర‌త్త‌లు పా‌టించాల్సి ఉంటుంది.

అయితే ఏ చిన్న చ‌ర్మ స‌మ‌స్య వ‌చ్చినా తెగ హైరానా ప‌డే అమ్మాయిలు.

ఆ స‌మ‌స్యల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.మార్కెట్‌లో దొరికే అనేక ఫేస్ క్రీములు, లోష‌న్లు కొనుగోలు చే‌సి.

ఉప‌యోగిస్తారు.కానీ, వాటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది మరియు స‌మ‌స్య‌ను తగ్గించేవి కావు.

అందుకే ఏ చ‌ర్మ స‌మ‌స్య అయినా స‌హ‌జ‌సిద్ధంగానే న‌యం చేసుకోవాల‌ని అంటున్నారు.అయితే స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో బాదం నూనె గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి బాదం నూనె చ‌ర్మానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు కొద్దిగా బాదం నూనెలో తేనె మిక్స్ చేసి.

ముఖానికి అప్లై చేయాలి. """/" / అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు త‌గ్గ‌డ‌మే కాకుండా.మ‌చ్చ‌లు కూడా న‌యం అవుతాయి.

బాదం నూనెలో కొద్దిగా నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి.ముఖానికి అప్లై చేయాలి.

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నిచ్చి.అనంత‌రం ముఖాన్ని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.ముఖంపై ఉన్న మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి.

నిమ్మరసంలోని సహజ బ్లీచింగ్ లక్షణాలతో పాటు బాదం నూనెలోని తేమను కాపాడే లక్షణాలు.

ముఖంపై న‌లుపును త‌గ్గించి మృదువుగా కూడా మారుస్తుంది.బాదం నూనెలో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి.

బాగా ఆరిన త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంలో కొత్త కాంతి సంత‌రించుకుంటుంది.

మ‌రియు ముడ‌త‌లు త‌గ్గి య‌వ్వ‌నంగా కూడా మారుతుంది.

ఉత్తరప్రదేశ్‌లో 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. వీడియో వైరల్